కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లె గ్రామ శివారు కూనవానిపల్లె లో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు మండలంలోని హనుమాజి పల్లి గ్రామానికి చెందిన కూన మల్లేశం, బోడ శ్రీనివాస్, వల్లంపాడు అరుణ్ లు కలిసి ద్విచక్ర వాహనంపై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి పని నిమిత్తం వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో కింద పడిపోయారు. వారికి తలకు ముఖానికి చేతులపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
