ఏపీలో స్కూళ్లకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష చేసిన మంత్రి లోకేశ్ సెలవులపై ప్రకటన చేశారు.
ఏపీలో దసరా హాలిడేస్‌పై క్లారిటీ వచ్చేసింది…
అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా ఇవే రోజుల్లో సెలవులు ఉండనున్నాయి. పాఠశాల విద్యపై రివ్యూ సందర్భంగా మంత్రి సెలవులపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని.. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే బాగా సెలబ్రేట్ చేయాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. గవర్నమెంట్ స్కూళ్లను బలోపేతం చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్‌కు రివ్యూ చేస్తామని చెప్పారు.