సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం రామతీర్థంలో 3.5 కోట్లతో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సంత నూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. తదుపరి రాజుపాలెం, లక్ష్మీపురం, కంభంపాడు గ్రామంలో నిర్వహించిన ” ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా గడిచిన వంద రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో అద్భుతమైన సంక్షేమ ఇవ్వగలిగామని, గత వైసిపి పాలనలో రాస్త్రాన్ని నాశనం చేశారన్నారు
స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు బస్సునే కార్యాలయంగా చేసుకొని ముఖ్యమంత్రి ఒక సైనికుడిలా వ్యవహరించారని, జగన్మోహన్ రెడ్డి లా ప్యాలెస్ కు పరిమితం కాలేదని గడిచిన ఐదేళ్ల పాలనంత గందరగోళంగా ఉందని, సంక్షోభంలో ను వంద రోజుల్లో అద్భుతమైన సంక్షేమం అందజేశారని, ముందు రోజుల్లో మరిన్ని సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టబోతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు అగ్గి రామయ్య, పమిడి రవితేజ,అడకస్వాములు, గొట్టిపాటి రాఘవరావు, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు మన్నం ప్రసాదు, చీమకుర్తి టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, యడ్లపల్లి రామబ్రహ్మం, రావిపాటి రాంబాబు , పూనాటి వెంకట్రావు, మలినేని శ్రీనివాసరావు,గ్రామ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.