సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలం లోని రేగులపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో అర్హులైన వారిని గుర్తించలేదని గ్రామస్తులు మరియు టిఆర్ఎస్,సిపిఎం బిజెపి నాయకులు మండిపడ్డారు, రేగులపల్లి గ్రామంలో ఇల్లు లేని వారు 535 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 367 మందిని ఎంపిక చేశామని అధికారులు గ్రామసభలో చదివారు, కానీ అర్హులైన వారు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ వారి పేరు జాబితాలో లేకపోవడం తో ఆ నిరుపేదలు తీవ్ర నిరాశకు గురయ్యారు, అధికారులను ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహించారు, కూలిపోయిన ఇల్లు మొత్తానికే ఇల్లు లేకుండా కిరాయికి ఉంటున్న వారికి కూడా మొండి చేయి చూపారు, ఎందుకు వీరికి రాలేదని ప్రశ్నిస్తే మొబైల్ యాప్ తప్పు మా తప్పేమీ లేదని అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆత్మీయ భరోసాలో కూడా 83 మందిని ఎంపిక చేసామని పేర్లు చదివారు. ఇందులో కొంతమంది వ్యవసాయ భూమి ఉన్నవారు ఉన్నారు. వారిని అనర్హులుగా ప్రకటించి నిజమైన భూమిలేని గుర్తించాలని కోరుతున్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించాలని కోరుతూ ఇందులో లేని వారు చాలామంది అర్హులకు మొండి చేయి చూపారు, నూతన రేషన్ కార్డులో కేవలం 46 మాత్రమే పేర్లు చదివారు కానీ రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు 120 మంది ఉన్నారు,వీరికి కూడా మొండి చేయి చూపడంతో గ్రామంలోని బిఆర్ఎస్, సిపిఎం, బిజెపీ నాయకులు ఈ జాబితా కాకుండా నూతనంగా అర్హులైన నిజమైన పేదలకు గుర్తించి నూతన జాబితాను తయారు చేయాలని వెంటనే పై అధికారులు స్పందించి నూతన జాబితాను తయారు చేయాలని కోరుతున్నారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దుంభాల మహేందర్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, బీజేపీ నాయకులు నూనె ఆంజనేయులు, బిఆర్ ఎస్ నాయకులు మాతంగి రజనీకాంత్, తాళ్ల స్వామి, కొట్టే శ్రీనివాసరెడ్డి, కుమ్మరి శ్రావణ్, వంగమోహన్ తదితరులు పాల్గొన్నారు.
