contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీసుపై దాడికి యత్నించిన నిందితులను వీధుల్లో నడిపించిన పోలీసులు

శ్రీకాళహస్తి: విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నించిన ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపింది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శ్రీకాళహస్తి వీధుల గుండా నడిపిస్తూ కోర్టు ముందు హాజరుపరిచారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ల్యాప్‌టాప్‌ పోయిందంటూ ఓ యువకుడు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య అక్కడ ఉన్న ఇద్దరు అనుమానిత యువకులను ప్రశ్నించారు.

ఈ క్రమంలో యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ను తీసుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ ప్రయత్నించగా, యువకులు కత్తితో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస్‌గా గుర్తించారు.

హత్యాయత్నం కేసు నమోదు

పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హెడ్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి యత్నించిన ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితులపై హత్యాయత్నం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడికి యత్నించడం పట్ల పోలీసు అధికారులు తీవ్రంగా స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తులో వెల్లడిస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :