- విద్యార్థినులపై లైంగిక వేధింపులు
- చెబితే చాక్ పీసు తాళి కట్టేస్తానని బెదిరింపు
- సస్పెండ్ చేసిన అధికారులు… పరారీలో కీచక ఉపాధ్యాయుడు… పోలీసులు గాలింపు.
చిత్తూరు జిల్లా : బంగారుపాల్యం మండలం : చిల్లగుండ్ల పల్లె :
అభం శుభం తెలియని విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటన…వికృత చేష్టలు చేస్తూ విద్యా వ్యవస్థ కే మచ్చ తెచ్చిన ఉపాధ్యాయుడు..బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో అబు (58) అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు.ఈయన నాలుగు, అయిదు తరగతులు చదువుతున్న 11 మంది విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు.వారిపట్ల పైశాచికంగా ప్రవర్తించి, చిత్రహింసలు పెట్టేవాడు. తల్లిదండ్రులు, ఇతరులెవ రికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి పంపేస్తానని, చాక్ పీసుకు ఓ తాడు ముడివేసి.. ఈ తాళి కట్టేస్తానని భయపెట్టే వాడు. దువ్వెనతో వారి తలలు దువ్వి, పౌడర్ రాసి, బొట్టు బిళ్లలు (స్టిక్కర్లు) పెట్టేవాడని విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం చిత్తూరు ఆర్డీవో రేణుక, డీఈవో పురుషోత్తం, ఎంఈవో నాగేశ్వరరావు, తహసీల్దారు సుశీలమ్మ, ఎంపీడీవో విద్యారమా , గ్రామస్తుల సమక్షంలో విలపించారు. వెంటనే స్పందించిన డీఈఓ సదరు ఉపాధ్యాయుడిని సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. అతడిపై పోక్సో కేసు నమోదుచేసి తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆర్డీవో ఆదేశించారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం. ఎస్. బాబు శుక్రవారం రాత్రి విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఉపాధ్యాయు డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వెలుగులోకి ఇలా..
ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని శుక్ర వారం సాయంత్రం తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఇందుశేఖర్రెడ్డి, సర్పంచి దీప ద్వారా కలెక్టరు హరినారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టరు స్పందించి విచారణకు ఆదేశించారు. విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడి కోసం పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు గాలిస్తున్నారు.