తుర్కపల్లి ఎస్సై రాఘవేంద్ర గౌడ్ గూండాగిరి…!
భూకబ్జాదారులతో కలిసి భూయజమానులపై దౌర్జన్యాలు…!
సివిల్ తగాదాలు సుష్టించి మరీ దాడులు…!
సంబంధంలేని వ్యక్తులను ఉసిగొల్పి అరాచకం..!
పోలీస్ వాహనాలతో ప్రైవేట్ స్థలాల్లోకి వెళ్లి హల్ చల్..!
కోర్టు తీర్పులు ఆదేశాలు భేఖాతరు..!
ఇక్కడ అంతా నేను చెప్పిందే శాసనం అంటూ బెదిరింపులు..!
గతంలో వలిగొండ ఎస్సై గా పనిచేస్తూ ఇదేవిదంగా వ్యవహరించి సస్పెండ్ కు గురైన రాఘవేంద్ర..!
మళ్ళీ విధుల్లో చేరినా బుద్ధిమార్చుకొని ఎస్సై..!
భూ కబ్జాదారులతో కుమ్మక్కయ్యి వారిపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలంటూ కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులలకు గురి చేస్తున్న తుర్కపల్లి ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ జగ్యా నాయక్ తండాకు చెందిన బాధితులు భూక్యా సోమ్లా నాయక్ , నరేందర్ లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 74/1/1 లో గత 60 ఏళ్లుగా తాత ముత్తాతలనుంచి సాగు చేసుకుంటున్న 2 ఎకరాల 26 గుంటల వ్యవసాయ భూమిని ఎస్సై సాగు చేసుకుని ఇవ్వడం లేదని అన్నారు. బ్రతుకు దెరువు కోసం 3 ఏళ్ళు వేరే గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చి తమ భూమిని సాగు చేసుకుందామని వెళ్ళగా భూ కబ్జా దారులు ప్రదీప్ కుమార్, నర్సింగ్ యాదవ్ లకు తుర్కపల్లి ఎస్ఐ కె.రాఘువేందర్ గౌడ్ కొమ్ము కాస్తూ తమపై భౌతిక దాడి చేయడమే కాకుండా భూమిని చదును చేస్తున్న జేసీబీ డ్రైవర్ పై దాడి చేసి, పాతిన ఫెన్సింగ్ తొలగించి, జేసీబీని సైతం సీజ్ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ సివిల్ వ్యవహారంలో ఎస్ఐ జోక్యం చేసుకుని తమపై దౌర్జన్యం చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి ఇంజక్షన్ ఆర్డర్లు కోర్టులు చాలా ఇస్తాయని జ్యూడిషల్ వ్యవస్థపై అగౌరవంగా మాట్లాడాడని అన్నారు. ఎస్సైతో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.