● ది రిపోర్టర్ టీవీ ఎఫెక్ట్..
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు చెట్లనిడే దిక్కు అనే కథనం ది రిపోర్టర్ టీవీలో బుధవారం ప్రసారం చేసింది. ఈ కథనంపై గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ స్పందించారు.. గన్నేరువరం మండలంలో 16 గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాలలో పరదలు తో నీడను ఏర్పాటు చేశారు..ది రిపోర్టర్ టీవీ కథనం పై స్పందించిన అధికారులకు.. ది రిపోర్టర్ టీవీ యజమాన్యానికి రిపోర్టర్ కు ఉపాధి కూలీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, మెడికల్ కిట్టు అందజేసినట్లు గన్నేరువరం కార్యదర్శి వెంకట్ రెడ్డి తెలిపారు.