కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను గురువారం తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ సందర్శించారు. గన్నేరువరం ట్రాక్టర్ యూనియన్ మరియు ట్రాక్టర్ ఓనర్స్ డ్రైవర్లతో సీఐ సదన్ కుమార్ మాట్లాడారు. అనుమతి లేకుండా ఇసుకను తరలించవద్దని ప్రతి ట్రాక్టర్ ఇసుక డిడి ల ద్వారా ఇసుకను తరలించాలని ఎవరైతే డీడీలు లేకుండా ఇసుకను తరలిస్తే డ్రైవర్లతో పాటు ట్రాక్టరు యజమాని లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైని ఎస్సై జె. అరుణ్, ఏఎస్ఐ రాధా కిషన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
