ప్రభుత్వం ఆదేశాల మేరకు పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు.సోమవారం ఆయన మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పంచాయతీకి ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మోడల్ పాఠశాల నందు తరగతికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు చొప్పున 5 మంది ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. తరగతి గదులు లేని చోట కొత్త తరగతి గదుల నిర్మాణం మరియు అదనపు సౌకర్యాలు కూడా కల్పించ బడుతుందని పేర్కొన్నారు.అవసరమైన చోట రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు.ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సమాజానికి పాఠశాల యాజమాన్య కమిటీ సహకారంతో తెలియచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,సి.ఆర్.పి.లు శ్రీనివాసులు, ప్రకాష్ రెడ్డి,జ్యోతి, శివకునమారి పాల్గొన్నారు.
