పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో కొన్ని రోజులుగా తమకు న్యాయం చేయాలంటూమహిళా రెజ్లర్లు రోడ్డెక్కడం భారతదేశ చరిత్రలోనే అసాధారణం. కావున వెంటనే దేశ దేశాలతో అనేక విధాలుగా ఆటలాడి మన దేశానికి మంచి పేరు తెచ్చిన రేజర్లు ను లైంగిక వేధింపు చేసిన ఎంపీ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కొమరాడ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం ప్రజా సంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి వేణు గారు మాట్లాడుతూ మన దేశానికి గాను ఒలింపిక్స్‌లో నాలుగు సార్లు, కామన్వెల్త్, ఆసియాడ్‌లలో అనేక సార్లు పతకాలు సాధించి అంతర్జాతీయంగా భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహిళా రెజ్లర్లు ఇప్పుడు ఆత్మగౌరవం కోసం రాజధాని నడిబొడ్డున రెండుసార్లు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం.
