contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న జీడిమామిడి రైతులు

అల్లూరి జిల్లా,రాజవొమ్మంగి: జీడి మామిడి పిక్కలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కష్టపడ్డా ఫలితం దక్కలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో జిడిపిక్కల ధర కేజీ 120 రూపాయలు ఉండగా, ప్రస్తుతం ఈ ధర 70 రూపాయలకు దిగి వచ్చిందని గిరిజన రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో జీడి మామిడి పిక్కలు రంగు మారిపోవడంతో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు దిగాలు పడ్డారు . అంతంత మాత్రమే జీడి మామిడి పంట దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేదని, వ్యాపారు లందరు కుమ్మక్కై ధర ను నియంత్రించారని ఈ విషయాలన్నీ గిరిజన సంక్షేమ అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారే తప్ప , గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :