పల్నాడు జిల్లా పిడుగురాళ్ల : బహుజన హక్కుల పోరాట సమితి ఆంధ్ర ప్రదేశ్ ( BHPS ) పత్రికా ప్రకటన హలో బహుజన చలో గుత్తికొండ ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం అనే నినాదంతో మార్చి 9 వ తారీకు గుత్తికొండ గ్రామంలో జరిగే ర్యాలీ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోరుకునే రాజకీయ పార్టీల వారు ఉద్యమ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని బి హెచ్ పి ఎస్ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంద కోటేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తికొండ గ్రామంలోని ఎస్సీ ఎస్టీలను అణచివేసే కుట్రలో భాగంగానే గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన స్థలాలు కు పట్టాలు ఉన్నప్పటికీ వాటికి పొజిషన్ చూపించకుండా ఆ స్థలాల్లో ప్రస్తుత పాలకవర్గం నవరత్నాల్లో భాగంగా నిరుపేదలకు ఇంటి స్థలాల కు కేటాయించడం దళితుల వద్ద ఒక్కొక్క ఫ్లాట్ కి 6000 రూపాయలు వసూలు చేసిన ఘనత గ్రామ నాయకులదేనని, పేదల సమస్యలు ఈనాటికి కొలిక్కి రాలేదని, పల్నాడు జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ లో అర్జీ ద్వారా వినతి చేసుకున్నప్పటికీ, ఈ సమస్యకు పరిష్కారం నేటికీ జిల్లా యంత్రాంగం చూపలేదు. ఈరోజు గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావుకి వినపత్రాన్ని అందించి పలు సమస్యల పై చర్చించారు. గుత్తికొండ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు ఇవ్వాలి గత ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలాల కు పొజిషన్ చూపించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని నెలకొని ఉన్న ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం మార్గం అయ్యేవరకు ప్రజా న్యాయ పోరాటం చేస్తామని , గ్రామంలోని ప్రజలు నిజాన్ని నిర్భయంగా చెప్పాలని కోరాను.
