తిరుపతి : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిపై తమకు విశ్వాసముందంటూ డిక్లరేషన్ లో జగన్ సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
డిక్లరేషన్ పై జగన్ ఎందుకు సంతకం పెట్టాలని భూమన ప్రశ్నించారు. జగన్ ఆ పని చేయరని స్పష్టం చేశారు. సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పారు. తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. మరోవైపు చివరి క్షణంలో తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకోవడం గమనార్హం.