- శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 25-09-2024 వ తేదీ నుండి 24-10-2024 వ తేదీ వరకు అమలు
- ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు.
- ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి.
- నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
- జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా 25.09.2024 వ తేదీ నుంచి 24.10.2024 వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏదైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలంటే ముందస్తుగా లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జి ఇచ్చి, వారి నుండి అనుమతి తీసుకోవాలని, ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు మొదలగునవి నిర్వహించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, వివిధ సమూహాలు, ప్రజలు పోలీస్ వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయడానికి పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు.