హైదరాబాద్ : మధురానగర్ తెలుగు యువత ఆధ్వర్యంలో టిడిపి వ్యవ స్థాపకులు నంద మూరి తారక రామారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన ప్రజల మనిషి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ అగ్రగామిగా నిలిచారన్నారు. కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసారు. అనంతరం మధురానగర్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్, శరత్, సురేష్, శ్రీకాంత్, శ్రవణ్, నారాయణ, జానకి, వెంకట్ రావు, సందీప్, ఆకాష్, శివరామ్, జయ్, గోపి, మహేష్, మల్లి, నాని, తనిష్, దుగ్గినేని, లక్ష్మీనారాయణ, నరేంద్ర, తులసీరామ్, అశోక్, ధర్మరాజు, జోగి, సుభాని, సాయి, పాల్గొన్నారు










