అనంతపురం జిల్లా గుత్తిలో అనంతపురం జిల్లా అధ్యక్షులు పాటిల్ సురేష్, బాయగడ్డ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయురారోగ్యాలతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆమె జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదగాలని పట్టణంలోని గుంతకల్ రోడ్డు చెరువు కట్ట బాలాఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పాటిల్ సురేష్, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, చిరంజీవి ఫ్యాన్స్ సీనియర్ అభిమాని చిన్న వెంకటేశులు, అశ్వ నాగప్ప, శంకర్, రామ్ చరణ్ ఫాన్స్ మిద్దె ఓబులేష్, అల్లు అర్జున్ యువత హరికృష్ణ షేక్షావలి, ఖాజావలి, రోహిత్, హరి, శేఖర్, సల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
