కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మాదాపూర్, మైలారం గ్రామ శివారులో రెచ్చిపోతున్న తిమ్మాపూర్ మండలానికి చెందిన అక్రమ కలప వ్యాపారి అక్రమంగా కలప తరలిస్తున్నట్టు సమాచారం. గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న చెట్లను నరకడమే ఇతని లక్ష్యం. అనుమతుల పేరిట కలప వ్యాపారం చేస్తూ చెట్లను పగలు నరికివేసి వాటిని ఓ రహస్య ప్రాంతంలో డంప్ చేస్తున్నాడు. ఒకవేళ అనుమతులు ఉన్న కూడా వాటి పరిధిని మించి కలపను నరికి వేస్తుండటం గమనార్హం. గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికివేస్తూ రహస్య ప్రాంతంలో డంప్ చేసి వాటిని ట్రాక్టర్ ద్వారా రాత్రి వేళల్లో అక్రమంగా చేరవల్సిన చోటుకి సురక్షితంగా చేరుస్తున్నాడు. అయితే ఈ అక్రమ తరలింపులో విలువైన కలప కూడా తరలి వెళ్తుండటం విశేషం. మండలంలో యథేచ్ఛగా కలప, అక్రమ తరలింపు జరుగుతున్న కూడా అటవీ అధికారులు ఇప్పటివరకు మండలంలో తనిఖీలు చేసి కలపని పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. తనిఖీలు చేపట్టకపోవడం పై అటవీ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా రైతులు అటవీ అధికారుల కు ఫిర్యాదు చేద్దామని ఫోన్ కాల్స్ చేస్తే అధికారుల ఫోన్లు కలవకపోవడం కోసమెరుపు, అటవీ అధికారులు నిర్లక్ష్యం వీడి గన్నేరువరం మండలంలో అక్రమ రవాణా ను అరికట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
