కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలో మూడు రోజుల నుండి విద్యుత్ స్తంభాలకు వీధిలైట్లు వెలగడం లేదని గన్నేరువరం గ్రామపంచాయతీ కారోబార్ కి కాలనీ వాసులు తెలుపగా కారోబార్ మాధవరావు వెంటనే ఎలక్ట్రిషన్ పాశం ప్రభాకర్ కు చెప్పడంతో ప్రభాకర్ వార్డుకు వెళ్లి ప్రభాకర్ మద్యం మత్తులో కాలనీవాసులపైకి దురుసుగా ప్రవర్తించాడు. ఏం చేసుకుంటరో చేసుకోండి.. మీకు వీధిలైట్లు రావు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తన వాహనంపై వెళ్లిపోయాడు. అనంతరం గ్రామ కార్యదర్శి వెంకట్ రెడ్డి, కారోబార్ మాధవరావుకు కాలనీవాసులు విషయాన్ని తెలిపారు. గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్ పాశం ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
