వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మట్టి వినాయకుడ్ని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అని తన సందేశాన్ని అందించారు .
హైందవ పండుగలలో కొన్నింటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని, కానీ వినాయక చవితిని మాత్రం ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారని ఆయన అన్నారు. అంతటి విశిష్టమైన ఈ పండుగ సందర్భంగా గణనాథుని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.