కరీంనగర్ జిల్లా, గన్నేరువరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో సేవలందిస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు సునీత, స్రవంతిని గన్నేరువరం ఎస్ఐ జి. నరేందర్ రెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సేవలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతి, భాస్కర్ రెడ్డి, రైటర్ రాజు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారి సేవలను కొనియాడారు.








