contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మళ్లీ గెలుస్తా.. ఇథనాల్ ఫ్యాక్టరీకి తాళం వేయిస్తా.. మాజీ ఎమ్మెల్యే రసమయి

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు..

● ఫ్యాక్టరీ కావాలా .. వద్దా అన్న దానిపై ఓటింగ్ పెడుతాం

● ఎమ్మెల్యేకు దమ్ముంటే సొంత నిధులతో అభివృద్ధికి చేయాలి

● ఇథనాల్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏటీఎంలా మారింది

● ఇసుక, మట్టి మాఫియా ఆగడాలకు అడ్డే లేదు

● విలేకరుల సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని,ఇథనాల్ ఫ్యాక్టరీకి తాళం వేయకుంటే నా పేరు మార్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ స్పష్టం చేశారు. ఆదివారం బెజ్జంకి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. ఇక్కడ ఫ్యాక్టరీని బంద్ చేసుకొని వెళ్లిపోవాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసులు పెట్టి భయపెట్టిస్తామ అంటే భయపడేది లేదని హెచ్చరించారు.. ప్రజల ప్రాణాలు తీసే ఫ్యాక్టరీలకు సహకరించేది లేదని, వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నా స్పష్టం చేశారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ కావాలా.. వద్దా అన్నదానిపై ఓటింగ్ పెడుతామన్నారు. ప్రజల గోడు పట్టించుకోని వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడడం సిగ్గు చేటుగా ఉందన్నారు. బెజ్జంకి మండలంలో ఉదయం లేచినప్పటి నుంచి ఇసుక మాఫియా, మట్టి మాఫియా ప్యాక్టరీ మాఫియా రెచ్చిపోతున్నదన్నారు. ఆరు మండలాల పరిస్థితి ఒకలా ఉంటే.. బెజ్జంకి మండల పరిస్థితి మరోలా ఉన్నదని, ప్రజలు కంటిమీద కునుకులే కుండా జీవనం వెళ్లదీసే పరిస్థితి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి, ఇసుక తరలిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని, ప్రజలు నిత్యం భయాందోళనలకు గురవుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్ మీద, కారు మీద బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వస్తారో.. లేదోనన్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ప్రజలంతా ఏకమై తరిమికొట్టిన పరిస్థితిని చూశామని గుర్తు చేశారు. కానీ బెజ్జంకి మండలంలో రెండు ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల ప్రాణాల మీదికి తీసుకొచ్చారని మండిపడ్డారు. అలాగే ఎన్నికల ముందు ఇక్కడి ఎమ్మెల్యే తనను గెలిపిస్తే మీ ఫ్యాక్టరీలను.. మిమ్ములను కాపాడుకుంటానని యజమాన్యులకు భరోసానిచ్చిన విషయం పత్రికల్లో చూశామని, ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు కారు కొనిచ్చారంటూ, రూ.2 కోట్లు లంచం ఇచ్చారంట జె సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందేనన్నారు. సదరు కంపెనీ ల యాజమాన్యంతో మిలాఖత్ అయి వాటా మాట్లాడుకున్నారో.. లేక ఏమైందో తెలియదన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవాలన్నారు.దమ్ముంటే సొంత నిధులు తీసుకొచ్చి బెజ్జంకి అభివృద్ధికి కృషి చేయాలని, మేమంతా సహకరిస్తామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలకు సహకరించి ప్రజల ప్రాణాలతీస్తామంటే ఊరుకునేది లేదని, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొచ్చి చంటి పిల్లలు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏటీఎంలాగా పనిచేస్తున్న దని మండిపడ్డారు. అన్ని గ్రామాల్లో మన సర్పంచ్లు గెలిస్తే మద్దతు నిలబడుతారని ఫ్యాక్టరీ యాజమాన్యాల దగ్గర డబ్బులు తెచ్చుకున్నది నిజం కాదా అని ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వారి దగ్గరి నుంచి డబ్బులు తీసుకొచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో పంచింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గారూ.. ఏం అభివృద్ధి చేయకున్నా పరువాలేదు. ఫ్యాక్టరీల పాపపు డబ్బుల కోసం ఆశపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదన్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి ఫ్యాక్టరీకి అండగా నిలిచిన వారిని పండబెట్టి తొక్కుతామని హెచ్చరించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చల్మెడ హాస్పిటల్ యాజమాన్యం తోటపల్లిలో పెద్ద స్కూల్ కట్టించారని, వాటర్ ప్లాంట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేపట్టారని, మీరు కూడా అలాంటి కార్యకమ్రాలు చేస్తే స్వాగతిస్తామన్నారు. బెజ్జంకి కరువు మండలమని చెప్పి బీఆర్ఎస్ హయంలో గోదావరి నీళ్లు తసుకొచ్చామని, ఈ రోజు ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :