contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా సావిత్రి బాయి పూలే 129 వ వర్ధంతి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్ల భవనంలో సామాజిక సంస్కర్త, దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. విద్య ద్వారా మహిళల సాధికారతకు ఆమె చేసిన కృషి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆంగ్లేయ ప్రభుత్వము సావిత్రిబాయి పూలేకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును ప్రదానం చేసినట్లు గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబూబకర్, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, కార్యదర్శి రామ్ మోహన్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, ఫక్రుద్దీన్, విజయలక్ష్మి, హర్షవదన, లక్ష్మీనారాయణ రెడ్డి, షైక్షా వళి, నారాయణ శెట్టి, దేవదాస్, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :