contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎమ్మెల్యే జగదీశ్వరిని కలిసిన నిమ్మక జయరాజు

కురుపాం/గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజా బలం కలిగిన నేత, మాజీ శాసనసభ్యులు నిమ్మక జయరాజు జనసేన పార్టీలో చేరడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు జగదీశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ​ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో జయరాజు చేరడాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి సాదరంగా ఆహ్వానించారుని. ఈ సందర్భంగా ఆమె ఆయనను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారుని .అనుభవం కలిగిన నేతలు పార్టీలోకి రావడం శుభపరిణామం అని. రానున్న రోజుల్లో పార్టీ మరియు ప్రభుత్వ కార్యకలాపాలను సమన్వయంతో ప్రజల్లోకి తీసుకువెళ్దాం అని ఎమ్మెల్యే జగదీశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.​ఈ ఆత్మీయ భేటీలో తోటపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ఆగూరు వైకుంఠరావు, కురుపాం మాజీ ఎంపీపీ హిమరక నీలకంఠేశ్వరరావు, డంగభద్ర మాజీ సర్పంచ్ జోగి స్వామినాయుడు, మరియు ప్రముఖ నేతలు పూయక ఆనందరావు, రెడ్డి హరికృష్ణ, మీసాల ప్రతాప్ తదితరులు పాల్గొని జయరాజుకి మద్దతు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :