కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: సిర్పూర్ మండలం వెంకటరావుపేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సమయంలో కాగజ్నగర్ నుంచి కౌటాల వైపు వెళ్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ Dande Vittal ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. మార్గమధ్యంలో సిర్పూర్–కౌటాల ప్రధాన రహదారిలోని వెంకట్రావుపేట్ రైస్ మిల్లు సమీపంలో గాయాలతో ఉన్న క్షతగాత్రులను చూసి ఆలస్యం చేయకుండా వారిని సమీప ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
కౌటాల పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా, ఎమ్మెల్సీ వెంటనే తన వాహనాన్ని ఆపి గాయపడిన వారిని ఆసుపత్రికి పంపించి ప్రాణదాతగా నిలిచారు.
అనంతరం ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడిన ఎమ్మెల్సీ దండే విఠల్, క్షతగాత్రులకు తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనపై స్థానికులు ఎమ్మెల్సీ స్పందనను అభినందించారు.








