తూప్రాన్/మెదక్ : గురువారం నాడు ఆర్డీఓ కార్యాల యంలోని సిబ్బంది అంతా Census Self Enumeration ప్రక్రియను పూర్తి చేసుకున్నారని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించబడిందని, దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు జనగణన ప్రక్రియ ప్రారంభ మవుతోందన్నారు. ఈ జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11వ తేదీ నుండి ఇళ్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని, తర్వాత వచ్చే సంవత్సరం జనాభా లెక్కల వివరాలను నమోదు చేస్తారని వెల్లడించారు.
ప్రజలు ఎవరికి వారు స్వయంగా ఆన్లైన్ https://se.census.gov.in/Self Enumeration వెబ్ సైట్ ద్వారా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ అని తెలిపారు. అందరూ ఈ నెల 10వ తేదీ లోపు తప్పనిసరిగా Self Enumeration పూర్తి చేసుకోవాలని సూచించారు. మన వివరాలను మనమే నమోదు చేసుకుంటే ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదన్నారు. ఆన్లైన్ Self Enumeration ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, తర్వాత 11వ తేదీ నుండి Enumerators ప్రతి ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేస్తారని ఆర్డీఓ జయ చంద్రా రెడ్ది తెలిపారు.








