తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తిరుపతి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి నగరంలోని 50వ డివిజన్ తిమ్మినాయుడు పాలెంలో కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ప్రజలకు వివరించే ‘డోర్ టూ డోర్’ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన కోలాహలంగా ప్రారంభించారు. టిటిడి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ లతో కలిసి జేబీ శ్రీనివాస్ ముందుగా స్థానిక గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రజల నుంచి హర్షాతిరేకాలు
అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికీ వెళ్లి, అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. కూటమి ప్రభుత్వ పాలనపై, అమలు చేస్తున్న పథకాలపై స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పర్యటనలో భాగంగా డివిజన్లో నెలకొన్న పలు స్థానిక సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వార్డులోని స్మశాన వాటిక సమస్యపై ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చించాం. సమస్య పూర్తిగా కొలిక్కి వచ్చాక దాని వివరాలు వెల్లడిస్తాం.” అన్నారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బిజీ కృష్ణ యాదవ్, యూనిట్ ఇన్ఛార్జ్ ఖాయం వెంకటరత్నం, డివిజన్ అధ్యక్షుడు దండు విజయ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, తాతయ్యగుంట ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జులు పులిగోరు మురళీకృష్ణ, ఆర్సీ మునికృష్ణ, వూకా విజయ్ కుమార్, దంపూరి భాస్కర్ యాదవ్, మునిశేఖర్ రాయల్, వెంకట కీర్తి, మన్యం శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వాసు, ఆముదాల తులసి, బ్యాంకు శాంతమ్మలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








