contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

30న కాగజ్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలంపాట

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ అక్రమ రవాణా కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఈ నెల 30వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు కాగజ్‌నగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వి. రవి ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. లక్ష్మానాయక్ సమక్షంలో జూలై 30న ఉదయం 10:30 గంటలకు కాగజ్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఈ బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వేలంపాటలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో హాజరుకావాలని సీఐ సూచించారు. వేలం వేయనున్న వాహనాల వివరాలు, వేలం నిబంధనలు, అర్హతలు మరియు ఇతర పూర్తి సమాచారం కోసం కాగజ్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌ను నేరుగా సంప్రదించాలని ఆయన తెలిపారు.

పారదర్శకంగా బహిరంగ వేలంపాట నిర్వహించనున్న నేపథ్యంలో ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :