contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కలెక్టరేట్‌లో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బందికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు యూనియన్ బ్యాంక్ రీజినల్ అధికారులు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

బ్యాంకులు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో సంస్థలు, బ్యాంకులు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.

ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని యూనియన్ బ్యాంక్ అధికారులను కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం. వెంకట శివరామిరెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సురేష్ బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ షాహీర్, యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ దయాకర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :