పల్నాడు జిల్లా – మాచర్ల : బీసీ సంక్షేమ సంఘం మాచర్ల నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా భీమవరపు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బత్తుల బాబురావు (వకీల్ సాబ్), జిల్లా కార్యదర్శిగా భీమవరపు శ్రీనివాసరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలిగా పగడాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.
మంగళవారం మాచర్ల రైల్వే స్టేషన్ రోడ్డులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గ ఎంపిక జరిగింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జింకల నాగేశ్వరరావు ప్రతిపాదించగా, రాష్ట్ర కార్యదర్శి బృంగా రమణారావు బలపరిచారు. అనంతరం పల్నాడు జిల్లా అధ్యక్షులు బిళ్లకంటి శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు నియామకాలను ఆమోదించారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ, బీసీల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ చట్టం సాధనతో పాటు ఎన్నికల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించే దిశగా సంఘం సభ్యులు ఉద్యమించాలని సూచించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పలువురు నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు కదం నాగజ్యోతి, జిల్లా అధికార ప్రతినిధి బాదంభాయి, మాచర్ల మండల అధ్యక్షులు వెంకట్రామయ్య, పట్టణ అధ్యక్షులు పోతులూరి పిచ్చయ్య, గోలి శ్రీనివాసరావు, శ్యామసుందరాచారి తదితరులు పాల్గొన్నారు.








