గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బీజేపీలో పార్టీ క్రమశిక్షణ, కార్యక్రమాల సమన్వయంపై అంతర్గతంగా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమరపు లావణ్య వ్యవహారశైలిపై పలువురు మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మండల అధ్యక్షులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేపట్టడం, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సమన్వయం లేకపోవడం వంటి అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి స్పందిస్తూ పార్టీ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించరాదని, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు మండల అధ్యక్షులు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదు చేసిన వారిలో బోడకుంట సుభాష్, గుండబోయిన భూమయ్య, ఊరగొండ అపర్ణ, మెరుగు నరేష్ ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ వ్యవహారంపై సంబంధిత నాయకుల నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.








