తిరుపతి : శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వి. వైకుంఠ రావు ని నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కె. బాల కార్తీక్ ఆధ్వర్యంలో పలువురు యూనియన్ నాయకులు, ఉద్యోగులు వీసీని కలిసి పూల బొకేని అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్-టీచింగ్ ఉద్యోగు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నూతన వీసీ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విన్నపాలపై సానుకూలంగా స్పందించిన వైస్ ఛాన్సలర్ డా. వి. వైకుంఠ రావు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నూతన వీసీ నాయకత్వంలో వర్సిటీ మరింత అభివృద్ధి సాధించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నారాయణరావు, ఐవోరయ్య, ఆర్. రమణ, లక్ష్మి, నవీన్, మురళి, మనోహర్, నీల నాయక్, చంద్ర, చలపతి, షణ్ముగం, శంకర, కృష్ణమూర్తి, కిరణ్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.








