గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేసే వారిని తరిమికొట్టాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం తిమ్మాపూర్, ఎల్ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్ హాల్ గన్నేరువరం మండలానికి చెందిన
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేయలేని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లోనే అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, ఇన్చార్జి ఎంపీడీవో సురేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాంతగి అనిల్, మహిళా అధ్యక్షురాలు జెల్లా రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు బుర్ర తిరుపతి గౌడ్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.








