contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

పల్నాడు జిల్లా – పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. భవనాసి ఫంక్షన్ హాల్‌లో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సమావేశానికి గురజాల నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :