contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పల్నాడు జిల్లా రేషన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గరిణే శ్రీనివాసరావు

పల్నాడు జిల్లా – మాచర్ల: పల్నాడు జిల్లా రేషన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం వినుకొండలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాచర్లకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గరిణే శ్రీనివాసరావు పల్నాడు జిల్లా రేషన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన గరిణే శ్రీనివాసరావును శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శ్రీనివాసరావు ముందుండి కృషి చేయాలని ఆకాంక్షించారు. డీలర్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన గరిణే శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పల్నాడు జిల్లా రేషన్ డీలర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి తరఫున సంబంధిత ప్రభుత్వ అధికారులను కలిసి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను జిల్లా బాధ్యతలకు ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మాచర్లకు చెందిన రేషన్ డీలర్లు ఓర్సు క్రాంతికుమార్, దోడ చందు, షరాబు అనిల్ కుమార్, షేక్ రసూల్, మాచర్ల బాబు తదితరులు పాల్గొని శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :