తెలంగాణ ప్రభుత్వం పై మాజీ సైనికులు మండిపడుతున్నారు. మల్కాజ్గిరి లోని CSD క్యాంటీన్ లో పెరిగిన రేట్లు అలాగే . కార్పొరేట్ హాస్పిటల్స్ లో మాజీ సైనికుల వైద్యం పై అఖిల భారత పూర్వ్ సైనిక సేవ పరిషద్ ఆధ్వరం లో సమావేశాన్ని ఏర్పాటు చేసారు. మద్యం పై తెలంగాణ ప్రభుత్వం పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని అలాగే హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించాలని సైనిక్ పరిషద్ కార్యదర్శి రమణ రెడ్డి డిమాండ్ చేసారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చెరించారు.
