అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ ఎన్టీఆర్ బరోసా పించను పంపిణీ లో భాగంగా డిసెంబర్ 1వ తేది ఆదివారం సెలవు కావడంతో ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 6.00 గంటల నుండి పెన్షన్ పంపిణి జరుగుతుందని తెలిపారు. పట్టణ పించను దారులందరూ తమ ఇంటి వద్ద ఉండి సచివాలయ ఉద్యోగుల ఉద్యోగుల ద్వారా పెన్షన్ తీసుకోవాలని, సాంకే తిక సమస్య ఉత్పన్నమైతే లబ్దిదారులు ఆందోళన చెందవద్దని తిరిగి సోమవారం కూడా పించను పంపినే చేస్తామని వెల్లడించారు.