పంచారామాలలో ప్రథమ క్షేత్రం పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర స్వామిని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆయనను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు స్వాగతం పలికారు. ఈవో సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకుల బృదం పూర్ణకుంభంతో స్వాగతించారు. మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి శేషవస్త్రం అందజేశారు.