భారత్, జపాన్ దేశాలు తొలిసారిగా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో భారత వాయుసేన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది కి అరుదైన ఘనత దక్కనుంది . విదేశాల్లో భారత్ తరఫున యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్న తొలి మహిళా పైలెట్ గా ఆమె నిలవనున్నారు. ఇండో-జపాన్ సంయుక్త విన్యాసాల్లో అవని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానంతో పాల్గొననున్నారు.
అవని 2018లో మిగ్-21 బైసన్ విమానం నడిపిన తొలి మహిళా పైలెట్ గా ఖ్యాతి గడించారు. ఆమె ఒక్కతే ఆ విమానాన్ని నడిపి అతివలు పురుషులకేమీ తీసిపోరని చాటారు. ఈ నేపథ్యంలో, జపాన్ లోని హయకురి వైమానిక స్థావరంలో నిర్వహించే వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాల్లో అవని సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
ఈ విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ సంయుక్త విన్యాసాల కోసం భారత వాయుసేన నాలుగు సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్-III సైనిక రవాణా విమానాలు, ఐఎల్-78 గగనతల ఇంధన ట్యాంకర్ విమానం, 150 మంది సిబ్బందిని పంపిస్తోంది. అటు జపాన్ తన ఎఫ్-2, ఎఫ్-15 వంటి యుద్ధ విమానాలను రంగంలోకి దించుతోంది.
An IAF contingent will depart tomorrow for Hyakuri Air Base, Japan for the maiden Exercise Veer Guardian 2023 to be held with Japan Air Self Defence Force from 12 to 26 Jan 2023
IAF will participate with four Su-30 MKI, two C-17 Globemasters & an IL-78 tanker.@JASDF_PAO_ENG pic.twitter.com/vIocSw7ywb
— Indian Air Force (@IAF_MCC) January 7, 2023