మెదక్ జిల్లా – తూప్రాన్ : తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక లారీని పోలీసులు ఆపి తనిఖీ చేయగా, అందులో సుమారు 250 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పరిశీలన నిమిత్తం సివిల్ సప్లై కార్యాలయానికి తరలించారు. వాహన డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, లారీ కర్ణాటక రాష్ట్రం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్తున్నట్లు సమాచారం.
ఘటనపై వెంటనే సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారి నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయనున్నట్లు తూప్రాన్ ఎస్సై వెల్లడించారు.








