- ఎవరి ఆదేశాల మేరకు రూ.6వేల రూపాయలు వసూలు చేశారు
- బి.హెచ్.పి.యస్ యోహన్ జొన్నలగడ్డ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ : బహుజన హక్కుల పోరాట సమితి ఆంధ్ర ప్రదేశ్ హలో బహుజన చలో గుత్తికొండ ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం అనే నినాదంతో ఈరోజు గుత్తికొండ గ్రామంలో బహుజన హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యోహన్ జొన్నలగడ్డ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనం పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఖంభం పాటి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా గుత్తికొండ గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. గుత్తికొండలో ఉన్న వైసీపీ నాయకులు ఒక్కొక్క లబ్ధిదారుల వద్ద నుండి రూ. 6000 రూపాయలు వసూలు చేశారు. ఇవి ఎవరు ఆదేశాల మేరకు వసూలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జరిగిందా?, పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిందా?, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సూచనలు మేరకు జరిగిందా? ఇది కచ్చితంగా సభ్య సమాజానికి తెలియాలి వెలుగులోకి తీసుకురావాలి అన్నారు.బి.హెచ్.పి.యస్ ఆధ్యర్యంలో జరిగే ఈ ప్రజా న్యాయ పోరాటానికి జనం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు బి.హెచ్.పి.యస్ అధినేత యోహాన్ జొన్నలగడ్డ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కులను, అభివృద్ధిని అణిచివేతకు గురిచేసే వ్యక్తులు ఎవరైనా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ గ్రామం లోని నివేశన స్థలాలు లేని నిరు పేదలకు పట్టాలు ఇవ్వాలి, పొజిషన్ చూపించాలి.గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నివేశన స్థలాలు ఏ సర్వే నెంబర్ లో వున్నాయో అవి ఆనాటి లబ్దిదారులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. గుత్తికొండ గ్రామంలో వైసీపీ నాయకులు ఒక్కొక్క లబ్ధిదారులు వద్ద నుండి రూ. 6000 రూపాయలు వసూలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలకు పొజిషన్ చూపియకుండా… ఇప్పుడు కొత్తగా వైసీపి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. లబ్ధిదారులకు సరైన పొజిషన్ చూపీయకుండా వైసిపి నాయకులు అనగారిన వర్గాలలో కుమ్ములాటలు లేపటంకోసం ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. జనం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతపల్లి రాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను అణచివేసే కుట్రలో భాగంగానే గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ,ఎస్టీలకు కేటాయించిన నివేసిన స్థలాలకు పట్టాలు ఉన్నప్పటికీ వాటికి పొజిషన్ చూపించకుండా ఆ స్థలాల్లో ప్రస్తుత పాలకవర్గం నవరత్నాల్లో భాగంగా నిరుపేదలకు ఇంటి స్థలాల కు కేటాయించడం దళితుల వద్ద ఒక్కొక్క ఫ్లాట్ కి రూ. 6000 వేల రూపాయలు వసూలు చేసిన ఘనత గ్రామ వైసీపీ నాయకులదే ఈనాటికి కొలికిరాని పేదల సమస్యను 01/09/2023 న పల్నాడు జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ లో అర్జీ ద్వారా తెలియపరిచాము అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం కాకపోవడం బాధాకరం అన్నారు.అధికార అహంకారం తోనే కొందరు అధికారులు ద్వితీయశ్రేణి నాయకులు, అధికారులు మమేకమై స్వార్థ రాజీయాలకు తెరలేపుతున్నారు. సత్వరమే ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం జరగకపోతే రానున్న ఎన్నికలలో భారతదేశ ప్రజలందరి ఓటు హక్కు
ద్వారా బుద్ధి చెప్పుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాగెండ్ల యలమంద,కావూరి ఆంజనేయులు,జొన్నలగడ్డ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.