contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీఆర్ ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు

  • గులాబీ తీర్థం పుచ్చుకున్న వందలాది మంది రజక, దేవంగ సంఘాల సభ్యులు, యూత్ కాంగ్రెస్ నేతలు
  • తెలంగాణ సమాజమంతా గౌరవ సీఎం కేసీఆర్  వైపే
  • అభివృద్ధి, సంక్షేమ పథకాలే మూడోసారి గెలిపిస్తాయి-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్: ఆర్మూర్ నియోజక వర్గంలో వివిధ వర్గాల వారు బీఆర్ ఎస్ లో చేరుతున్నారు.  తాజాగా రజక సంఘం, దేవంగ సంఘం, యువజన కాంగ్రెస్ లకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు లింగం, రాజు, పిరాజి, రాజేందర్,సురేష్, పొశెట్టి, రాజు, అంబెం సురేష్ తదితరుల ఆధ్వర్యంలో దాదాపు 40 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరారు. అలాగే మాక్లూర్ మండలం చిక్లీ గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్, యూత్ కాంగ్రెస్ మాక్లూర్ మండల మాజీ అధ్యక్షులు, షేర్ ఖాన్, ఫారుఖ్, అనిసోద్దిన్, నజీరుద్దిన్, ఇమ్రాన్, తదితరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెన్నంటి నడుస్తామని ప్రకటించారు. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన దేవాంగ సంఘం సభ్యులు కూడా భారీ ఎత్తున బీఆర్ ఎస్ కు మద్దతు పలికారు. వారంతా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గల మినిస్టర్ క్వార్టర్స్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే,బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నజీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చు కున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై తామంతా
బీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు. వారికి జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రెట్టింపు గౌరవం ఉంటుందని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. “దేశ్ కీ నేత కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ” అనే నినాదాలతో మంత్రుల నివాస ప్రాంగణం దద్దరిల్లింది.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజమంతా గౌరవ సీఎం కేసీఆర్ వైపే ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ ఎస్ ను మూడోసారి గెలిపిస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న అచంచల విశ్వాసం తోనే అన్ని వర్గాల వారు బీఆర్ ఎస్ లో చేరుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రేగుళ్ల రజనీకాంత్, గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్, ఎంపీటీసి మల్లేష్, పీఏసీఎస్ ఛైర్మన్ కల్లెం భోజరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, దేవాంగ సంఘం అధ్యక్షులు దుగ్గి మధు, ఉపాధ్యక్షులు సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువ నాయకులు కంఠం అభిలాష్, గంగారం గ్రామ సర్పంచ్ సొంతె రమేష్, జాదు సురేష్, గొట్టుముక్కల ప్రశాంత్, శ్రీకాంత్, చిక్లీ శ్రీకాంత్, అశోక్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :