తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టుగల్లు మండలం పరిధిలోని చట్టేవారిపాలెం గ్రామ పంచాయతీలో మినీ గోకులంకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముందుగా మినీ గోకులం భూమి పూజకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పశు సంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, పశు సంవర్ధక శాఖ మంత్రి. శుక్రవారం చట్టేవారిపాలెం గ్రామ పంచాయతీలో మినీ గోకులంకు భూమి పూజ, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో గత పాలకులు స్వార్థ ప్రయోజనాల, నిర్లక్ష్య వైఖరితో రైతులను, రైతాంగాన్ని గాలికి వదిలేసిన గత పాలకులు.ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఎమ్మెల్యే పులివర్తి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతులను, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలంలో పాడి ఆవులు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టుగల్లు మండలానికి అన్. ఆర్. జీ.ఎస్ నిధుల ద్వారా సుమారు 179 గోకులాలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.179 గోకులాలకు సుమారు 4కోట్ల రూపాయలను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకు 2 అవుల మినీ గోకుళంకు 1 లక్ష 65 వేల రూపాయలు,4 ఆవుల మినీ గోకుళంకు 1 లక్ష 90 వేల రూపాయలు,6 ఆవుల మినీ గోకుళంకు 2 లక్షల 35 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించినట్టు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.