కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట స్వయంభు శ్రీ మానసాదేవి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనం సకల మానవాళికి భగవంతుడు కృప చేస్తాడని ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ తెలిపారు. శుక్రవారం ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోపూజ లు చేశారు. కోడెలను కట్టారు. హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చెర్మన్ ఏలేటి చంద్ర రెడ్డి, కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.