ప్రకాశం జిల్లా చీమకుర్తి లో అక్రమ అక్రమ గ్రానైట్ తొవ్వకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. లీజుదారులు గడువు ముగిసిన తర్వాత అక్రమంగా తవ్వుతున్నా, లీజు లేకుండా మింగేస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. క్వారీలో ప్రమాదాలు జరిగినా .. ప్రాణాలు పోయిన పట్టించునే నాధుడే లేడు. క్వారీలో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా అదనపు తవ్వకాలకూ పచ్చజెండా ఊపడం ఇక్కడ కొసమెరుపు.
ఓరియంట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగింది. కొండచెర్యలు విరిగిపడ్డట్టు పెద్ద పెద్ద బండరాళ్ళు కిందపడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిస్తోంది. ప్రాణ నష్టం జరిగిందా లేదా అనే విషయం గోప్యాంగనే ఉంది. అక్కడి మ్యానేజర్ ప్రమాదం పెద్దగానే ఉంది కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదంటున్నారు. కృష్ణసాయి పేరుతో ఉన్న లీజ్ ఆగిరిమెంట్ 2023 సమత్సరంలో అయిపోయింది. కానీ అర్ధరాత్రి అక్రమంగా క్వారీ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బ్లాస్టింగ్ డ్రిల్లర్స్ , కట్టర్స్ ఉన్నాయి. కానీ పోలీసులు వచ్చేసరికి అవి అక్కడినుండి మాయమయ్యాయి. అక్రమాలను సక్రమమని చూపేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
క్వారీ లోపల పని చేయడానికి మాత్రం ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులను ఎందుకు పెట్టుకున్నారు ? స్థానికులను ఎందుకు కార్మికులుగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రమాదంలో స్థానికుడు చనిపోతే బట్టబయలుతుంది .. అదే ఇతర రాష్ట్రాల వారైతే విషయం బయటి రాకుండా తొక్కిపెట్టవచ్చు. ఇదేనా ప్రధాన కారణం ?
ఇటువంటి మైనింగ్ లలో కార్మికులకు రక్షణ లేదు . ప్రమాదాలు జరిగినపుడు అక్కడ కార్మికులు ఉన్నరలో లేదో తెలుసుకోవడానికి సిసి కెమెరాలు లేవు .. మైనింగ్ సేఫ్టీ మాయమైంది. ఇకనైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.