- చీమకుర్తి క్వారీ ల్యాండ్ స్లైడ్ జరిగిన సంఘటన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ
- గ్రానైట్ పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి: ఎస్పీ ఆర్ దామోదర్.
- రిపోర్టర్ టివి కథనంతో స్పందించిన అధికారులు
చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓరియంట్ క్వారీలో ఈరోజు ఉదయం సుమారు 5 గంటల సమయంలో హైవాల్ పెద్ద ఎత్తున రాళ్లు, మట్టి పెళ్ళలు జారిపడ్డాయి. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి, సంఘటన జరిగిన తీరుతెన్నెలు కారణాలను పరిశీలించారు. సంఘటన జరగటానికి గల కారణాలు బ్లాస్టింగ్ వలన మరియు ఇతర కారణాల వలన జరిగిందన్ని కోణాల్లోనూ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలని మరియు అన్ని క్వారీల భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి, తనిఖీ చేయాలని, ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా క్వారీలు నడిపితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చీమకుర్తి సీఐ సుబ్బారావు , ఎస్సై కృష్ణయ్య లకు ఆదేశాలిచ్చారు.
అనంతరం పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి చీమకుర్తి పియస్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని, గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి విధుల వంటి వాటిపై ఆరాతీశారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ సిబ్బందికి పలు గ్రామాలను కేటాయించాలని, సిబ్బంది తరచు గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు.
జిల్లా ఎస్పీ తో పాటు ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఎస్సై కృష్ణయ్య మరియు సిబ్బంది ఉన్నారు.