ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.బెల్లంపల్లి నియోజకవర్గంలో 31 మంది లబ్ధిదారులకు 13,63,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం క్యాంపు కార్యాలయంలో అబ్ధిదారులకు మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సిఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని, ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. సిఎం కెసిఆర్ పేదల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయాలను సిఎం సహాయ నిధి నుంచి అందించామని, ఇకపై కూడా అనారోగ్యంతో బాధపడుతు వైద్యం చేసుకున్న నిరుపేదలకు బి అర్ ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ గారు, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బి అర్ ఎస్, బిఅర్ఎస్వి, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు .










