contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సర్పంచ్ భర్త ఆగడాలు… పోలీసులకు ఫిర్యాదు

జగిత్యాల జిల్లా- బీర్పూర్:  చిన్న పదవి ఉంటే వారి ఆగడాలకు అడ్డు.. అదుపూ లేకుండా పోతున్నాయి. ఇక అధికార పార్టీ అయితే సరే సరి.. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ భర్త .. ప్రభుత్వ అధికారులపై నోరు పారేసుకొని బెదిరింపు పాలుపడుతున్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లా బీర్పూర్ అధికార పార్టీ సర్పంచ్ ఆగడాలు మితిమీరాయి. పంచాయతీ కార్యదర్శిని సర్పంచ్ భర్త రమేష్ బంధించారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బీర్పూర్ పంచాయతీ కార్యదర్శి సతీష్ విధులకు సర్పంచ్ భర్త పదే పదే అంతరాయం కలిగిస్తున్నాడు. తాను చెప్పిన విధంగా చేయడం లేదని సర్పంచ్ భర్త రమేష్ కార్యదర్శి సతీష్ ను ప్రతిరోజు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తిడుతూ చంపుతానని బెదిరించి గదిలో బంధించాడు. ఈ విషయం ఎంపీడీవోకు తెలియడంతో బందీ గా ఉన్న సతీష్ ను బయటకు తీసుకొచ్చాడు.
సర్పంచ్ భర్త రమేష్ తన విధులకు తరచు ఆటంకం కలిగిస్తూ.. బెదిరిస్తున్నాడని బీర్పూర్ పంచాయతి కార్యదర్శి సతీష్ జగిత్యాల రూరల్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శిల్ప, భర్త రమేష్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ అరిఫ్ అలిఖాన్ సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :