కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు , ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే కొన్ని సూచనలు చేసారు. తుంగభద్ర డ్యాం నుండి 90 వేల క్యూసెక్కుల నీటిని 28 గేట్ల ద్వారా వదిలారని తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన మేరకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నియోజకవర్గం లోని నది పరివాహక ప్రాంతమైన నందవరం మండలంలోని గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ దండోరా వేయించాలని, నదీ పరివాహ గ్రామాలు అనగా నదీ కైరవడి, గంగవరము, జోహారాపురం,పెద్దకొత్తిలి, చిన్నకొత్తిలి, నాగలదిన్నె, గురజాల, రాయచోటి గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇంటి దగ్గరే ఉండేలా చూసుకొని, చిన్న పిల్లలు ఈతకు, మహిళలు బట్టలు ఉతకడానికి వెళ్లకుండా ఉండాలన్నారు .ఆయా గ్రామాలకు సంబంధించిన విఆర్వోలు, పంచాయతి సెక్రటరీలు, సర్పంచులు, గ్రామ పెద్దలు దండోరా వేయించాల్సిందిగా ఆదేశించరు.