contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం లో చిరుతల రామాయణం నాటక ప్రదర్శన

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చిరుతల రామాయణం నాటక ప్రదర్శన ప్రారంభించారు. చిరుతల రామాయణ ప్రదర్శన మూడు రోజులు పాటు కార్యక్రమం జరుగుతుంది. శనివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, ఆదివారం రావణాసుర సంహారం, సోమవారం శ్రీ సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం ఉంటుందని భజన మండలి సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మన గన్నేరువరంలో తిరిగి ఈ అద్భుత ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు మూడు రోజులపాటు జరిగే చరుతల రామాయణ ప్రదర్శనను తిలకించి మన సంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు,ఉప సర్పంచ్ రామంచ స్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :